ఐఐటి - జెఇఇలో రాష్ట్ర విద్యార్థుల హవా
హైదరాబాద్: ఐఐటి జెఇఇలో తెలుగు విద్యార్థుల హవా కనిపించింది. ఓపెన్ కెటగిరీలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 5,6 జాతీయ ర్యాంకులు వచ్చాయి. నారాయణ సంస్థకు చెందిన శేష పవన్ శ్రీనాథ్ ఐదో ర్యాంకు సాధించాడు. రిజర్వేషన్ కోటాలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 9, 11 ర్యాంకులు వచ్చాయి.
రామయ్య ఐఐటి కోచింగ్ సెంటర్‌కు వంద దాకా ర్యాంకులు వచ్చాయి. దాదాపు 400 మందికి సీట్లు లభించే అవకాశాలున్నాయి. ఐ ఐటిపై రాష్ట్రంలో చైతన్యం పెరిగిందని రామయ్య అంటున్నారు. వంద లోపు తమకు పది ర్యాంకుల వచ్చాయని నారాయణ విద్యాసంస్థలవారు చెప్పారు. శ్రీచైతన్యకు 200 దాకా ర్యాంకులు వచ్చాయి. రాష్ట్రంలోని కార్పోరేట్ విద్యాసంస్థలు ఐఐటి - జెఇఇ కోచింగ్‌లో పోటీ పడుతున్నాయి.












Click it and Unblock the Notifications
