Sardar 2 Public Talk: ‘సర్దార్ 2’ పబ్లిక్ టాక్ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే?

Sardar 2 Public Talk: స్టార్ హీరో కార్తీ కథానాయకుడిగా వచ్చి స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న సర్దార్ 2' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఎస్జే సూర్య విలన్‌గా చేరడం, భారీ బడ్జెట్, భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Maremma Movie Review: రవితేజ తమ్ముని కొడుకు హీరోగా మొదటి సినిమా.. ఫిట్టా.. ఫట్టా?
Maremma Movie Review: రవితేజ తమ్ముని కొడుకు హీరోగా మొదటి సినిమా.. ఫిట్టా.. ఫట్టా?

కార్తీ నటన, యాక్షన్ సీన్లకు మార్కులు
ఎక్స్(ట్విట్టర్) వేదికగా వేకువజాము నుంచే ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ మెజారిటీ నెటిజన్లు దీనిని ఓ 'ఎంగేజింగ్ సీక్వెల్'గా అభివర్ణిస్తున్నారు. మొదటి ఫ్రేమ్ నుంచే రేస్ మొదలవుతుందని, కొడుకు కార్తీ ఎంట్రీ శాంతంగా ఉన్నప్పటికీ.. 'ఓల్డ్ సర్దార్' ఎంట్రీ దద్దరిల్లిపోయేలా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. కార్తీ తన ద్విపాత్రాభినయంలో మరోసారి అద్భుతమైన ప్రదర్శనకనబరిచారని, మాళవిక మోహనన్ తగిన మద్దతు ఇచ్చారని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. అలాగే సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని కామెంట్స్ వస్తున్నాయి.

Sardar 2 Public Talk Karthi Spy Action Thriller Sequel Gets Decent Response story highlights

సెకండాఫ్, రన్ టైంపై కొంత నిరాశ
ఈ చిత్రంలోని కొన్ని అంశాలపై నెట్టింట విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకున్నప్పటికీ.. సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ముందే ఊహించగలిగే స్టోరీ, సాగదీసే సీన్లు, వీఎఫ్ఎక్స్ నాణ్యత లోపించడం వంటివి సినిమా వేగాన్ని తగ్గించాలని కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు 3 గంటల రన్ టైం, స్టోరీలో లాజిక్ లోపించడం నిరాశ పరిచాయని మరికొందరు పేర్కొన్నప్పటికీ.. హీరో-విలన్ మధ్య వచ్చే సీన్లు, చివరి 30 నిమిషాలు ఆకట్టుకుంటాయని.. మొత్తంగా ఇది ఒక డీసెంట్ వాచ్ అని రేటింగ్ ఇస్తున్నారు.

నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మోక్షజ్ఞ సరసన హిట్ బ్యూటీ?
నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మోక్షజ్ఞ సరసన హిట్ బ్యూటీ?

డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ స్పై ఫ్రాంచైజీలో కార్తీ సరసన్ మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ కీలక పాత్రలు పోషించారు. ప్రతి నాయకుడిగా ఎస్జే సూర్య నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తూనే అంతర్జాతీయ స్థాయి నిఘా డ్రామాగా తెరకెక్కింది. మొత్తానికి 'సర్దార్ 2' సినిమా 'ఎబోవ్ యావరేజ్' నుంచి డీసెంట్ వాచ్ అనే టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి భాగం రేంజ్ లో పూర్తిస్థాయి మ్యాజిక్ చేయలేకపోయినా.. కార్తీ నటన, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం థియేటర్లలో ఒకసారి చూడొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+