కాలం మారింది...పని చేస్తే సరిపోదు, ఇక నుంచి- తేల్చి చెప్పిన చంద్రబాబు...!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. ఇప్పుడు కాలం మారింది...పని చేస్తే సరిపోదని.. ఫేక్ ప్రచారాలకు కౌంటర్ కూడా ఇవ్వాలని సూచించారు. ఫేక్ ప్రచారం చేస్తుంటే లీడ్ తీసుకుని రియాక్ట్ అవ్వాలని నిర్దేశించారు. ప్రభుత్వాన్ని మభ్యపెట్టే నివేదికలు వద్దు...వాస్తవాలు చెప్పాలని స్పష్టం చేసారు. సాధారణ పరిపాలన కాదు... ప్రజలు మెచ్చే సుపరిపాలన కావాలని చెప్పారు. బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుందాం...బెస్ట్ పాలసీలు అమలు చేద్దామని చంద్రబాబు అధికారులకు క్లారిటీ ఇచ్చారు.
రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక టార్గెట్ ఫిక్స్ చేసారు. అధికారులకు పలు సూచనలు చేస్తూనే... అనేక అంశాల పైన మార్గనిర్దేశం చేసారు. రివ్యూలు కాదు రిజల్ట్ కావాలి అని తేల్చి చెప్పారు. గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కావాలని సూచించారు. ప్రజా సేవకులుగా ఉందాం...ఈగోలు వద్దు అంటూ కలెక్టర్లకు సూచన చేసారు. ఈ సమావేశంలో లీడర్‌షిప్, జీఎస్‌డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్‌పై చర్చ చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టామని స్పష్టం చేశారు. రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ. 1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంత లు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు.

చంద్రబాబు దిశా నిర్దేశం
కాగా.. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్టు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని భౌగోళిక అసమానతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది... దానిని సరిచేస్తూ ఆయా ప్రాంతాలకు నీటిని ఇవ్వగలిగితే కలిగే సంతోషం వేరుగా ఉంటుందని తెలిపారు. గోదావరి- కావేరీ- మహానది- గంగా లాంటి నదులు అనుసంధానమై వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారత అభివృద్ధి అన్ స్టాపబుల్ అని చెప్పారు. ఈ నీటి భద్రత, సంరక్షణా చర్యల్ని గుర్తించి వాటర్ మాన్‌గా పేరు పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. 36 ప్రాజెక్టులు చేపట్టేందుకు క్యాలెండర్ కూడా ఇచ్చామని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతోపాటు అధికారుల తోడ్పాటుతోనే ఈ విజయాలను సాధించగలిగామని చెప్పారు. మనకు ఉన్న అవకాశాలను అన్ లాక్ చేయగలిగామని.. ప్రతీ శాఖలోనూ సంస్కరణలు తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు వివరించారు.













Click it and Unblock the Notifications
