పులి ఎముకలు, చిరుత చర్మాలు.. అరుదైన జీవుల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణులు, వాటి అవయవాలను అక్రమంగా తరలిస్తున్న అంతర్జాతీయ, జాతీయ స్మగ్లింగ్ ముఠాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు సింహస్వప్నమై విరుచుకుపడ్డారు. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా సాగించిన రహస్య దాడుల్లో భారీ స్మగ్లింగ్ రాకెట్ల గుట్టు రట్టయింది. పక్కా ముందస్తు సమాచారంతో అధికారులు చేపట్టిన 6 వేర్వేరు ఆపరేషన్లలో రెండు చిరుతపులి చర్మాలు, 180 అరుదైన నక్షత్ర తాబేళ్లు, 12 బతికున్న టోకే గేకో తొండలు, ఏకంగా 24 కిలోల పొలుసుల పంది (పాంగోలిన్) పొలుసులు, అరకిలో పులి ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఈ చట్టవిరుద్ధ దందాకు పాల్పడుతున్న 13 మంది స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఒడిశాలో చిరుత చర్మం స్వాధీనం!
సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు సెప్టెంబర్ 7న ఒడిశాలోని కోరాపుట్ జిల్లా జైపూర్ సమీపంలో మెరుపు దాడి చేశారు. అక్కడ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న చిరుతపులి చర్మం లభ్యమైంది. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూల్-1 కింద చిరుతపులులకు అత్యున్నత రక్షణ ఉంటుంది. వాటి అవయవాలను కలిగి ఉండటం, విక్రయించడం తీవ్రమైన నేరం. దీంతో నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న చిరుత చర్మాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం కోరాపుట్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

బెంగళూరులో 180 అరుదైన నక్షత్ర తాబేళ్ల రక్షణ!
అదే రోజున మరొక బృందం కర్ణాటకలోని బెంగళూరు గాంధీనగర్ సమీపంలో నిఘా పెట్టి ఒక అనుమానితుడిని అడ్డుకుంది. అతడి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, 6 బట్టల సంచుల్లో దాచిన 180 బతికున్న 'ఇండియన్ స్టార్ తాబేళ్లు' బయటపడ్డాయి. వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB) వీటిని 'జియోచెలోన్ ఎలిగాన్స్' రకానికి చెందిన అరుదైన జీవులుగా గుర్తించింది. వీటి వీపుపై నక్షత్రాల వంటి ఆకర్షణీయమైన గుర్తులు ఉండటంతో, అంతర్జాతీయ పెట్ మార్కెట్‌లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. స్మగ్లర్ల బారి నుంచి వీటిని కాపాడిన అధికారులు, నిందితుడిని అరెస్ట్ చేశారు.
మేఘాలయలో 15 కిలోల పాంగోలిన్ పొలుసులు పట్టుబడ్డాయి!
మూడో ఆపరేషన్‌లో భాగంగా మేఘాలయలోని రి-భోయ్ జిల్లాలో మౌహతి వైపు వెళ్తున్న ఒక బొలేరో వాహనాన్ని అధికారులు అడ్డుకున్నారు. వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయగా మూడు సంచుల్లో దాచిన 14.68 కిలోల ఎండిపోయిన పాంగోలిన్ (పొలుసుల పంది) పొలుసులు దొరికాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అక్రమ రవాణాకు గురవుతున్న క్షీరదాలలో పాంగోలిన్ ఒకటి. సాంప్రదాయ ఆసియా వైద్యంలో వీటి పొలుసులకు డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లు వీటిని వేటాడుతున్నారు. స్వాధీనం చేసుకున్న పాంగోలిన్ పొలుసులు, వాహనం, నిందితుడిని నాంగ్‌పో రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్‌కు అప్పగించారు.














Click it and Unblock the Notifications
