విశాఖ జిల్లా వి. మాడుగలలో లాకప్‌డెత్?
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా వి. మాడుగుల ఆబ్కారీ పోలీసు స్టేసన్‌లో లాకప్ డెత్ జరిగింది. వి. మాడుగుల ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో లాకప్ డెత్ సంభవించినట్లు సమాచారం అందడంతో దర్యాప్తు నిమిత్తం పోలీసు బృందాన్ని పంపినట్లు డిఐజి గోవింద్‌సింగ్ చెప్పారు.
నాటుసారా కాస్తున్నాడని ఆరోపిస్తూ చీడికాడ మండలం కోనాం గ్రామవాసి అప్పారావు వి. మాడుగుల ఆబ్కారీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అప్పారావు శవాన్ని ఆబ్కారీ పోలీసులు తుప్పల్లో పడేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆబ్కారీ పోలీసులే అప్పారావును చంపారని ఆరోపిస్తూ వారు మాడుగుల ఆబ్కారీ పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications
