పోలీసు కస్టడీకి కృషి వెంకటేశ్వరరావు
హైదరాబాద్: డిపాజిటర్లను ముంచి విదేశాలకు పారిపోయిన కృషి బ్యాంకు చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావును ఈనెల 2 నుంచి 7 వరకు పోలీసు కస్టడీకి పంపారు. వెంకటేశ్వరరావును విచారించడానికి సిఐడి పది రోజుల కస్టడీ కోరగా కోర్టు ఏడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. విచారణ సమయంలో కొసరాజును హింసించరాదని కోర్టు ఆదేశించింది. కొసరాజు విచారణలో అతనికి సహకరించిన పెద్దల బండారం బయట పడవచ్చని భావిస్తున్నారు. తెలుగుదేశం హయాంలో కొసరాజుకు రాజకీయ నాయకుల పోలీసు ఉన్నతాధికారుల సహాయసహకారాలు అందినట్టు ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications
