చంద్రబాబు, దేవేందర్ గౌడ్ భేటీ
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు (టిడిపి) చంద్రబాబునాయుడు, మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్ శనివారంనాడు ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్‌లో సమావేశమయ్యారు. చంద్రబాబుకు, దేవేందర్‌గౌడ్‌కు మధ్య విభేధాలులొచ్చాయని వీరిపై పత్రికల్లో వచ్చిన వార్తల నేపధ్యంలో ఈ నేతలిద్దరూ ఈ రోజు సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలసేపు చర్చలు జరిపారు. అనంతరం దేవేందర్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా వైస్ ఛైర్మన్ పదవినిని ఒప్పందం ప్రకారం సిపిఎంకు ఇవ్వనందుకు చాలా బాధకలిగిందని చెప్పారు. అంతేగానీ పార్టీ అధ్యక్షునితో తనకు విభేధాలు అవాస్తమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా పార్టీ సంస్థాగత విషయాలపైనే చర్చలు జరిపినట్లు ఆయన సమాధానం చెప్పారు.












Click it and Unblock the Notifications
