అక్యురా క్లాసిక్ తొలి రౌండ్‌లో సానియా జోడీ గెలుపు
న్యూఢిల్లీ: 1.3మిలియన్ డాలర్ల అమెరికా అక్యురా క్లాసిక్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా జోడీ డబుల్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. సానియా మీర్జా తన దక్షిణాఫ్రికా భాగస్వామి లీజెల్ హుబర్‌తో కలిసి కెనడా, స్లోవిక్ జోడీ మౌరిన్ డ్రేక్, టీనీ క్రిజాన్‌లను తొలి రౌండ్‌లో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది.
సానియా, హుబర్ జోడీ ఈ ఏడాది ప్రారంభంలో అన్‌సీడెడ్ జోడీని 6-0, 6-4 స్కోర్‌తో ఓడించి బెంగుళూర్ ఓపెన్ టోర్నమెంట్‌ను కైవసం చేసుకుంది. రెండో రౌండ్‌లో సానియా జోడీ రష్యాకు చెందిన అన్నా చాక్వెటెడ్జ్, అమెరికాకు చెందిన జిల్ క్రేబాస్ జోడీని ఎదుర్కుంటుంది.












Click it and Unblock the Notifications
