మత్తు మందుల కేసులో రాహుల్ మహాజన్‌కు సమన్లు
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల వినియోగం కేసులో రాహుల్ మహాజన్‌తో పాటు ఐదుగురిపై ఢిల్లీ పోలీసులు స్థానిక కోర్టులో అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అభియోగాలను విచారించిన కోర్టు, సెప్టెంబర్ 14 లోపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ రాహుల్ తదితరులకు సమన్లు జారీ చేసింది. రాహుల్, సాహిల్ జరూ, హరీష్ శర్మ, గ ణేష్ కుమార్ సిన్హాలతో పాటు ఇద్దరు నైజీరియా దేశస్థులు లతీఫ్ అషోలా మహ్మద్ అబ్దుల్లా, ఎగ్బెడొకన్ జేమ్స్ తైవులకు న్యాయమూర్తి ఎస్.ఎన్ గుప్తా సమన్లు జారీ చేశారు. జూన్ 1,2 తేదీలలో రాహుల్ తన తండ్రి అధికార నివాసంలో జరిగిన పార్టీకి సంబంధించి మాదక ద్రవ్యాలను పంపిణీ, వినియోగాలకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన అభియోగంలో పేర్కొన్నారు. స్వయం వినియోగానికై జరు కొకైన్ కలిగి ఉన్నాడని, మత్తు పదార్ధాల చేరవేతలో అతని ప్రమేయం కూడా ఉందని పోలీసులు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications