అగార్కర్‌కు గాయం: మిగతా మ్యాచ్‌లకు దూరం
ముంబాయి: భారత ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ గాయం కారణంగా ఛాంపియన్ ట్రోఫీకి చెందిన మిగతా క్రికెట్ మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ఎడమ చేతి బొటనవేలికి గాయం కావడంతో అగార్కర్ ఆడలేని స్థితిలో పడ్డాడు. గురువారం అహ్మదాబాద్‌లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిటర్న్ షాట్‌ను ఆపేందుకు ప్రయత్నించినప్పుడు గాయపడ్డాడు.
దీంతో అగార్కర్ స్థానంలో మరో బౌలర్‌ను ఎంపిక చేసుకునేందుకు ఐసిసిని బిసిసిఐ విజ్ఞప్తి చేసింది. అందుకు ఐసిసి అనుమతించింది. దీంతో అగార్కర్ స్థానంలో శ్రీశాంత్‌ను బిసిసిఐ ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకోవడానికి అగార్కర్ నాలుగు వారాలు పట్టవచ్చునని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టును సోమవారంనాడు ఎంపిక చేస్తారు. దీనికి అగార్కర్‌ను ఎంపిక చేస్తారా, లేదా అనేది వేచి చూడాల్సి వుంది.












Click it and Unblock the Notifications
