మోనికా బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్: సినీ నటి, అండర్‌వరల్డ్ డాన్ అబూ సలేం ప్రియురాలు మోనికా బేడీ బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు సోమవారంనాడు నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. మోనికా బేడీ దాఖలు చేసిన అపీల్‌పై విచారణను కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. గోపాలకృష్ణ 16వ తేదీకి వాయిదా వేశారు. అపీల్ సోమవారం విచారణకు రాగానే ప్రముఖ క్రిమినల్ లాయర్ వాదించడానికి వస్తున్నందున విచారణను 16వ తేదీకి వాయిదా వేయాలన్న మోనికా బేడీ తరఫు న్యాయవాది ప్రదీప్ కుమార్ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి మన్నించారు.
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికా బేడీకి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 29వ తేదీన తీర్పు చెప్పింది. సిబిఐ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆమె హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గుడా జైలులో శిక్ష అనుభవిస్తోంది.












Click it and Unblock the Notifications
