ఎసిబి సోదాల్లో లక్షల ఆస్తులు వెల్లడి
హైదరాబాద్: ఇద్దరు అధికారుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గురువారంనాడు విడివిడిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లక్షలాది రూపాయల అస్తులు బయట పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంస్థ జనరల్ మేనేజర్ యలమందారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఎసిబి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాదులోని ప్రగతినగర్, సోమాజీగూడా ఇళ్లలో, ప్రకాశం జిల్లాలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. తన ఎదుగులను చూసి ఓర్వలేకనే ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారని యలమందా రెడ్డి అంటున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం వాణిజ్య పన్నుల అధికారి (సిటివో) మాలకొండయ్య ఇళ్లలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన కార్యాలయంలో కూడా వారు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 60 లక్షల రూపాయల నగదు, మూడు ఇళ్లు, ఒక కారు, ఇతర ఆస్తులు బయట పడ్డాయని ఎసిబి అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications