తప్పిన వాయుగండం
హైదరాబాద్: వాయుగుండం కారణంగా అతలాకుతలమైన మన రాష్ట్రానికి ఊరట లభించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం రాత్రి ఎనిమిదిన్నరకు పూరీ తీరాన్ని దాటింది. ఇది ఒరిస్సాలోని అంగూర్ వద్ద భూభాగంపై కేంద్రీకృతమై ఉంది.
దీని ప్రభావం ఉత్తరాంధ్ర మినహా మన రాష్ట్రం మీద తక్కువని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, తెలంగాణ ప్రాంతాలు మేఘావృతమై ఉంటాయి కానీ వర్షం పెద్దగా పడదని వారు చెప్పారు.
సెప్టెంబర్ నెలలో ఈ 24 రోజుల్లో రెండు మూడు రోజులు మినహా మిగితా దినాల్లో వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల కారణంగా నగరం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంది.












Click it and Unblock the Notifications