ఇండియన్ ఐడల్ గా ప్రశాంత్ తమాంగ్
న్యూఢిల్లీ: కొన్ని వారాల ఉత్కంఠకు తెరపడింది. అత్యంత ప్రజాదరణ పొందిన సోనీ ఎంటర్ టైన్మెంట్ టెలివిజన్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ గా ప్రశాంత్ తమాంగ్ ఎంపికయ్యారు. తుది పోరు న్యూఢిల్లీలోని ఓక్లా ఇండస్ట్రియల్ ఎస్టేటులోని జాతీయ లఘు పరిశ్రమల సంస్థ మైదానంలో మూడు గంటల జరిగింది. వేలాది అభిమానులు ఊపిరి బిగపట్టి తుది ఫలితం కోసం వేచి చూశారు.
తాను గెలుపొందినట్లు వినగానే ప్రశాంత్ ఆనందభాష్పాలను నిలువరించుకోలేకపోయారు. 24 ఏళ్ల ప్రశాంత్ డార్జిలింగులో కానిస్టేబులుగా పనిచేస్తున్నారు. అతనితో పాటు తల్లి కూడా ఆనందంతో కంట తడి పెట్టుకున్నారు. షిల్లాంగుకు చెందిన అమిత్ పాల్ రన్నరప్ గా నిలిచారు. ప్రశాంత్ కోటి రూపాయలతో పాటు ఒక మారుతి కారును గెలుచుకున్నారు.












Click it and Unblock the Notifications