ప్రాజెక్టుల అవినీతిలో వైయస్ కు ముడుపులు: బాబు
మహబూబ్ నగర్: సాగునీటి ప్రాజెక్టుల అవినీతిలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ముడుపులు ముడుతున్నాయని, అందుకనే ముఖ్యమంత్రి ప్రాజెక్టుల్లో చోటు చేసుకుంటున్న అవినీతిపై నోరు మెదపడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆయన సోమవారంనాడు ప్రాజెక్టుల బాట చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెంపల్లి వద్ద కెసి కెనాల్ పనులను పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
నాసిరకం పనుల వల్ల సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మిగిలిందని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు. కెసి కెనాల్ పనులు 1200 కోట్ల రూపాయలతో పూర్తి కావలసి ఉందని, అయితే కాంట్రాక్టర్ల కోసం అంచనాలు పెంచుతున్నారని, ఈ అవినీతిలో ముఖ్యమంత్రికీ పాలు ఉందని ఆయన అన్నారు. నాణ్యత లేని పనుల వల్ల నీళ్లు రావని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications