జాగృత్ కిడ్నాప్ కథ సుఖాంతం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి అదృశ్యమైన జాగృత్ అహహరణ కధ సుఖాంతమైంది. కిడ్నాపర్లు అతన్ని బాల్కండలోని ఒక దాబాలో వదిలి వెళ్లారు. నాలుగు రోజుల క్రితం జాగృత్ అపహరణకు గురయ్యాడు. టీవీ చానెళ్లలో ఫొటోలు చూసిన స్థానికులు అతన్ని గుర్తు పట్టి పోలీసులకు తెలిజేశారు. దాంతో పోలీసులు అతన్ని తీసుకుని నిర్మల్ కు తరలించారు.
నాలుగో తరగతి చదువుతున్న జాగృత్ నాలుగు రోజుల క్రితం గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాపర్లు ఏ విధమైన డిమాండ్లు పెట్టలేదు. షరతులు కూడా విధించలేదు. దీంతో కిడ్నాప్ నకు కారణం తెలియడం లేదు. జాగృత్ ను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. జాగృత్ నీరసించి ఉన్నట్లు కనిపించాడు.












Click it and Unblock the Notifications