చిరు కూతురు పెళ్లి వెనక పిజెఆర్ కొడుకు?
హైదరాబాద్: చిరంజీవి కూతురు శ్రీజ వివాహం అత్యంత పకడ్బందీగా శిరీష్ భరద్వాజ్ తో జరగడం వెనక కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి కుమారుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శిరీష్ భరద్వాజ్ జనార్దన్ రెడ్డికి మంచి మిత్రుడే కాకుండా, తల్లి తరఫున ఇరువురు బంధువులవుతారని అంటున్నారు. తనకు పెద్దమ్మ తల్లి ఆశీస్సులున్నాయని, తాను పెద్దమ్మ తల్లి భక్తుడినని శిరీష్ భరద్వాజ్ బుధవారం టీవీ చానెళ్ల ప్రతినిధులతో అన్నారు. పి. జనార్దన్ రెడ్డి పెద్దమ్మ తల్లి భక్తుడనే విషయం తెలిసిందే. హైదరాబాదులోని ప్రకాష్ నగరులో ఉండే సాధారణ కుటుంబానికి చెందిన శిరీష్ సాహసం చేసి చిరంజీవి కూతురును రహస్యంగా ఆర్య సమాజ్ పెళ్లి చేసుకోవడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, జీన్స్ ప్యాంటు, టీ షర్టు వేసుకుని ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ఇంటి నుంచి బయలుదేరింది. శిరీష్ భరద్వాజ్ తో కలిసి సికింద్రాబాదులోని న్యూబోయినపల్లిలో గల ఆర్య సమాజ్ కు వెళ్లారు. దాదాపు గంట సేపు ఇరువురి వివాహం జరిగింది. వివాహానికి సంబంధించిన వీడియో తీసి మొదట ఒక టీవీ చానెల్ కు పంపించారని, అయితే ఆ టీవీ చానెల్ దాన్ని ప్రసారం చేయలేదని తెలుస్తోంది. దాంతో వారు ఆ వీడియో క్యాసెట్లను మరో రెండు టీవీ చానెళ్లకు పంపించారని అంటున్నారు. వీటిలో ఒక టీవీ చానెల్ అదే పనిగా వివిధ కథనాలతో దాన్ని ప్రసారం చేస్తూ వచ్చింది. ఇదంతా పకడ్బందీగా జరగడానికి శరీష్ మిత్రులు అతనికి తోడ్పాటు అందించారు.












Click it and Unblock the Notifications
