చార్జీల పెంపు ప్రతిపాదనలు అందలేదు: కన్నా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) బస్సు చార్జీల ప్రతిపాదన ప్రభుత్వం వద్దకు ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చార్జీలను పెంచే విషయమై ఆర్టీసి కసరత్తు చేస్తూ ఉండవచ్చునని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఆర్టీసి లాభాల్లో ఉన్నప్పటికీ వేయి కోట్ల రూపాయల దాకా బకాయిలున్నాయని ఆయన చెప్పారు. ఉద్యోగుల జీతాలు 340 కోట్ల రూపాయల దాకా పెరిగాయని, 3750 మంది ఉద్యోగులను క్రమబద్దీకరించారని, డీజిల్ ధర పెరిగిందని, ఆ భారాన్నంతా ఆర్టీసి మోయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ స్థితిలో చార్జీలు పెంచాలని ఆర్టీసి ఆలోచిస్తూ ఉండవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications