ఎమ్మెల్యే చెంగల అరెస్టుకు పోలీసుల యత్నం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట తెలుగుదేశం శాసనసభ్యుడు చెంగల వెంకట్రావు అరెస్టుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బంగారయ్యపేట ఘర్షణకు సంబంధించి చెంగలతో పాటు మరో 30 మందిపై కేసు నమోదైంది. చెంగల వెంకట్రావు పరారీలో ఉన్నారు. అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్లగా అది గమనించి ఎమ్మెల్యే వెనక ద్వారం గుండా పారిపోయారని ఎస్పి సబర్వాల్ చెప్పారు. ఆయన అజ్ఞాతంలో వెళ్లారు.
ఎమ్మెల్యే లొంగిపోవడమే మంచిదని, తాము అరెస్టు చేసి తీరుతామని ఎస్పీ సబర్వాల్ అంటున్నారు. శాసనసభ్యుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చెంగల వెంకట్రావుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications