లేపేసే సత్తా మాకుంది, అలాచేయలేదు: పవన్
హైదరాబాద్: చిరంజీవి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆయన కుమార్తె శ్రీజ పెళ్ళి రోజుల టీవీ చానల్స్ పై చెప్పడం పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తమకు టార్గెట్లుగా ఉన్న వారిని లేపేయడం తమకు పెద్ద కష్టం కాదని, ఆ సత్తా తమకు ఉన్నా ఆ పని చేయలేదని ఆయన అన్నారు.
శ్రీజ ప్రేమ వ్యవహారం నాలుగు నెలల ముందే తనకు తెలుసని, అన్నగారు ఆవేదన చెందుతారని ఆయన వద్ద ఈ ప్రస్తావన తేకుండా గుండెల్లో దాచుకున్నానని పవన్ వెల్లడించారు. చిరంజీవి కుటుంబంలో తాను ఆవేశపరుడినని, తమ ప్రాణాలకు హాని ఉందని శ్రీజ దంపతులు చెప్పడంపై పవన్ ఆలస్యంగా నేడు స్పందించారు. తమ అభిమానులు గూండాలు కారని, తమ వద్ద కిరాయి రౌడీలు లేరని ఆయన అన్నారు. తాను ఆవేశపరుడిని కాదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
