శ్రీజ దంపతులకు పవన్ సాదర ఆహ్వానం


Sreeja & Sireesh Bharadwaj హైదరాబాద్: తన సోదరుడు చిరంజీవి కూతురు శ్రీజ దంపతులను తాము సాదరంగా ఆహ్వానిస్తున్నామని సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీజ దంపతులు తమ ఇంటికి వచ్చినా, తన అన్న చిరంజీవి ఇంటికి వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వారు కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వారు భయపడతారనే ఉద్దేశంతో రివాల్వరును తాను పోలీసులకు స్వాధీనం చేశానని ఆయన చెప్పారు.

శ్రీజ భవిష్యత్తుపైనే తమ ఆందోళన అని ఆయన అన్నారు. శిరీష్ భరద్వాజ్ పై పలు కేసులు ఉండటమే తమ ఆందోళనకు కారణమని ఆయన అన్నారు. శ్రీజ దంపతులు దాక్కోవలసిన అవసరం లేదని ఆయన చెప్పారు. వారికి తాము ఏ విధమైన హామీ తలపెట్టబోమని ఆయన అన్నారు. శ్రీజ పారిపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ వద్ద కిరాయి గుండాలు లేరని, తమ అభిమానులు కిరాయి గూండాలు కారని, తమ సినిమాలు చూసి తమను అభిమానిస్తారని, తాము వారిని అభిమానిస్తామని ఆయన అన్నారు. శ్రీజ దంపతులు ఎందుకు భయపడుతున్నారో తమకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. మేజర్ అయిన అమ్మాయి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+