నిజమైన ప్రేమ పారిపోదు: పవన్
హైదరాబాద్: నిజమైన ప్రేమ పారిపోదని, ఉన్నచోటనే ఉండి పోరాడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. తన అన్న కుమార్తె శ్రీజ ప్రేమ వివాహంపై ఆయన ఈ విధంగా ప్రతిస్పందించారు. ప్రేమ జంటలను వెదకాల్సిన అవసరం పోలీసులకు ఉండదని, పోలీసులకు ఇంకా ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయని ఆయన అన్నారు.
తాను చెన్నై రైఫిల్ క్లబ్ లో సభ్యుడినని, తనకు రివాల్వర్ బహూకరించింది అన్నయ్య చిరంజీవి గారని ఆయన చెప్పారు. ఇప్పుడు తనకు ప్రాణ భయం లేదని, అందువల్లనే రివాల్వర్ ను పోలీసుల వద్ద డిపాజిట్ చేసినట్టు ఆయన తెలిపారు. తాము ఎవరికీ హాని చేయబోమని ఆయన అన్నారు. శ్రీజ, ఆమె స్నేహితుడు ఎక్కడ ఉన్నా బాగుండాలని తాము రుకుంటున్నామని పవన్ చెప్పారు.












Click it and Unblock the Notifications
