శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాదు వద్ద గల పాతంరాయి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినవారు. మృతులను వైవి శర్మ (53), లలిత (45), సుధీర్ (26)లుగా గుర్తించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి కారులో వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న కారు నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. కారు మొత్తం లారీ కిందికి దూసుకుపోయింది. దీంతో ముగ్గురు మరణించగా కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications