విచారణకు వైయస్ భయపడుతున్నారు: బాబు


హైదరాబాద్: సిట్టింగ్ జడ్జితో ఆస్తులపై విచారణకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం మైనారిటీ సెల్ ప్రమాణస్వీకారోత్సవ సభలో ఆయన శనివారం మాట్లాడారు. సిట్టింగ్ జడ్జిని తమ ఇద్దరి ఆస్తులపై విచారణకు ఇవ్వాలని తాను సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తానని, ముఖ్యమంత్రి కూడా ఆ విధమైన విజ్ఞప్తి సుప్రీంకోర్టుకు చేయాలని ఆయన అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ముఖ్యమంత్రి అక్రమాలను నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

తనపై ఎన్నో విచారణ సంఘాలు వేసుకున్నారని, ఇంకా వేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఎదురుదాడిలో ముఖ్యమంత్రి ప్రజలను నమ్మించలేరని ఆయన అన్నారు. అక్రమ సంపాదనను ఢిల్లీ పెద్దలకు పంచి పెడుతూ తనను ముఖ్యమంత్రి పొగిడించుకుంటున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాజశేఖరరెడ్డిని ప్రశంసించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+