కర్ణాటకలో బిజెపికి జెడి-ఎస్ మద్దతు
బెంగుళూర్: కర్ణాటక రాజకీయాలు అకస్మాత్తుగా మలుపు తిరిగాయి. ప్రజల వద్దకు వెళ్లడానికి సిద్ధమని చెప్పిన జనతాదళ్ - సెక్యులర్ (జెడి-యస్)నేత ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ మేరకు కుమారస్వామి నేతృత్వంలోని జెడి-యస్ గవర్నరుకు శనివారం మద్దతు లేఖను అందించింది. బిజెపి నేత యడియూరప్పకు మద్దతు ఇవ్వడానికి ఆయన అంగీకరించారు.
కుమారస్వామి ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత కేంద్రం కర్ణాటకలో రాష్ట్రపతి పాలనను విధించింది. ప్రభుత్వ ఏర్పాటును పర్యవేక్షించేందుకు బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు ప్రస్తుతం బెంగుళారులో ఉన్నారు. ఈ కొత్త పరిణామంపై జెడి-ఎస్ సీనియర్ నేత దేవెగౌడ పెదవి విప్పడం లేదు.












Click it and Unblock the Notifications