వారు క్షమాపణ చెప్తే నేను చెప్తా: రోజా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి క్షమాపణ చెప్తే తాను క్షమాపణ చెప్తానని తెలుగు మహిళ అధ్యక్షురాలు, సినీ నటి రోజా అన్నారు. నాయని నర్సింహారెడ్డి తనను కించపరచారని ఆమె శనివారంనాడు మీడియాతో అన్నారు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని ఆమె అన్నారు. మహిళ అని కూడా చూడకుండా తెరాసవారు తనను అవమానించారని ఆమె అన్నారు.
తెరాస అధినేత కె. చంద్రశేఖరరావుపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని, అటువంటప్పుడు రాజకీయాలకు మరికొంత సమయం కేటాయిస్తే మంచిదనే ఉద్దేశంతో మాత్రమే తాను మాట్లాడానని ఆమె వివరణ ఇచ్చారు. వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగే ఉద్దేశం తనకు లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications