కెసిఆర్ ను నేను కొత్తగా అనలేదు: రోజా
హైదరాబాద్: రాత్రి బారు, పగలు దర్బారు అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఆయన సన్నిహితులే అన్నారని, తాను కొత్తగా అన్నది కాదని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా అన్నారు. కెసిఆర్ కు సన్నిహితంగా మెలిగిన నరేంద్ర అన్న మాటలే తాను అన్నానని, శాసనసభ్యుడు జయప్రకాశ్ రెడ్డి కూడా అదే మాట అన్నారని, వారంటే తప్పు లేదు గానీ తానంటే తప్పు ఎలా తప్పు అవుతుందని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
మగవాళ్లు అంటే తప్పు లేదు గానీ మహిళలు అంటే తప్పా అని ఆమె ప్రశ్నించారు. తెరాసవారు చౌకబారు రాజకీయం చేస్తున్నారని ఆమె అన్నారు. తన పట్ల తెరాస శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి అవమానకరంగా వ్యవహిరంచారని, ముందు నాయని తనకు క్షమాపణ చెప్పాలని ఆమె అన్నారు. తమ నాయకుడు నారా చంద్రబాబునాయుడును తెరాసవాళ్లు అన్నారు కాబట్టి తాను కెసిఆర్ ను అన్నానని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కెసిఆర్ మీద తనకు వ్యక్తిగతంగా కోపం లేదని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications