వాగులో బస్సు, క్వాలిస్: ఐదుగురు గల్లంతు
హైదరాబాద్: నెల్లూరు జిల్లా మామిడి కాల్వ వద్ద వాగులో ఒక మినీ బస్సు, క్వాలిస్ చిక్కుకున్నాయి. వీటిలో ప్రయాణిస్తున్న ఐదుగురు గల్లంతయ్యారు. ఇవి వాగులో చిక్కుకున్నాయనే సమాచారం అందగానే తాము పడవను పంపించామని, వారిని రక్షించే ప్రయత్నం చేశామని, అయితే ఐదుగురు గల్లంతయ్యారని రాష్ట్ర మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి మీడియా ప్రతినిధులతో చెప్పారు. వాగులో చిక్కుకున్న సమయంలో బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని భావిస్తున్నారు.
కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వరద పరిస్థితిని సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన కోస్తా అధికారులకు సూచించారు. రేపటి సమావేశానికి రావద్దని నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లకు సూచించారు. వరద బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సహాయక చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.












Click it and Unblock the Notifications