'పెద్ది' సినిమా ఫస్ట్ కాపీ చూసి చిరంజీవి సీరియస్..?? బుచ్చిబాబును పిలిచి..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పెద్ది' మేనియా నడుస్తోంది. మరో 20 రోజుల్లో అంటే జూన్ 4న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పలుసార్లు వాయిదా పడింది. బెస్ట్ అవుట్ పుట్ కోసం చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకే సినిమా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేసుకుంది. ఈ మేరకు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిమరీ జూన్ 4న పెద్ది సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. క్రికెట్, కుస్తీ పోటీలు, విజయనగరం గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన 'పెద్ది' సినిమాలోని రెండు గ్లింప్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ టాప్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. త్వరలోనే ఓ మాస్ సాంగ్ ను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు పాటల్లో చరణ్ డ్యాన్స్ దుమ్ము దులిపారు. ఇక ఈ మాస్ సాంగ్ లో స్టెప్పులు ఏ రేంజ్ లో ఉంటాయో ఆలోచిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. తాజాగా పెద్ది సినిమాకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. పెద్ది సినిమా ఆర్ ఆర్ ఇటీవలె పూర్తయిందట. అయితే రీ రికార్డింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ఓసారి చూశారని సమాచారం.

RamCharan Peddi June 4th Chiranjeevi Watches First Copy Gives Suggestions to Director Buchi Babu

పెద్ది సినిమాను చూసిన చిరంజీవి.. బుచ్చిబాబును పిలిచి సినిమాలో చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారట. బుచ్చిబాబు కొన్ని విషయాల్లో లాజిక్స్ మర్చిపోతే వాటిని డైలాగ్స్ తో ఆ లాజిక్స్ ను కవర్ చేయోచ్చని బుచ్చిబాబుతో చెప్పినట్లు సమాచారం. అయితే దానికి బుచ్చిబాబు కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఇక పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీలో జగపతిబాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+