ఎట్టకేలకు విజయ్ ప్రమాణ స్వీకారం - వీసీకే మద్దతు తో పూర్తి మెజార్టీ..గవర్నర్ అనుమతి...!!
తమిళనాడులో సస్పెన్స్ కు తెర పడింది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మంది మద్దతు లభించింది. ఊహించని ట్విస్టులు.. అంచనాలకు అందని లెక్కల తరువాత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. మూడో సారి గవర్నర్ తో విజయ్ భేటీ సమయంలో 116 మంది మద్దతు లేఖలు సమర్పించారు. మరో రెండు సీట్ల కోసం ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. ఇక, ఇప్పుడు వీసీకే మద్దతు ఖరారు కావటంతో.. మరోసారి గవర్నర్ ను విజయ్ కలవనున్నారు. ఇక.. సీఎంగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లే.
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కు మరో రెండు సీట్ల దూరంలో ఉన్నారు. వీసీకే కు రెండు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంలే వీసీకే కొన్ని షరతులు విధించింది. వీటితో సుదీర్ఘంగా విజయ్ టీం తో చర్చలు జరిగాయి. రెండు పార్టీల మధ్య ఒప్పందం ఖరారు కావటంతో ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించేందుకు విజయ్ అంగీకరించారు. ఇక.. అధికారికంగా వీసీకే మద్దతు లేఖతో గవర్నర్ ను కలసి తాము పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని చెప్పనున్నారు. గవర్నర్ కోరినట్లుగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు దక్కటంతో ఇక ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ ను ఆహ్వానించటం లాంఛనంగా కనిపిస్తోంది.

వీసీకే మద్దతుతో తొలిగిన అడ్డంకి.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు
టీవీకే ప్రభుత్వానికి మద్దతు పైన వీసీకే షరతులతో ముందుకు వచ్చింది. ప్రభుత్వంలో.. కూటమి లో భాగస్వాములుగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో తమ పార్టీకి ప్రాధాన్యత ఉండాలని తేల్చి చెప్పింది. అందులో భాగంగా విజయ్ వద్దకే తమ ప్రతిపాదనలను పంపింది. సుదీర్ఘ చర్చల తరువాత రెండు వైపుల నుంచి ఒప్పందం కుదిరింది. ఇప్పుడు వీసీకే నిర్ణయంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. గవర్నర్ తో కలిసి పూర్తి మెజార్టీకి సంబంధించిన వివరాలను విజయ్ అందించనున్నారు. ఆ వెంటనే గవర్నర్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటు పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నెంబర్ గేమ్ కొనసాగుతున్న వేళ మరింత ఆలస్యం చేయకుండానే ప్రమాణ స్వీకారం చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఇటు చర్చలు కొనసాగిస్తూనే... అటు ప్రభుత్వ ఏర్పాట్ల పైనా కసరత్తు జరుగుతోంది.













Click it and Unblock the Notifications