రామ్ చరణ్ "పెద్ది" కోసం రంగం లోకి ఎంఎస్ ధోనీ.. ఇక పూనకాలే !!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం "పెద్ది". ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ముఖ్యంగా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లోనే కాదు, సాధారణ సినీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి Janhvi Kapoor హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ అవార్డు గ్రహీత A. R. Rahman సంగీతం అందిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ Shiva Rajkumar, సీనియర్ నటుడు Jagapathi Babu, బాలీవుడ్ నటుడు Divyendu Sharma కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, పోస్టర్లు, టీజర్ తరహా వీడియోలు సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా పొడవాటి జుట్టు, గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించిన రామ్ చరణ్ అభిమానులను ఆకట్టుకున్నారు. ఆయన బ్యాట్‌తో కొట్టిన ఐకానిక్ క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అలానే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'పహిల్వాన్ గ్లింప్స్' అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఆ వీడియోలో చరణ్ చూపించిన ఇంటెన్స్ లుక్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఇంత భారీ క్రేజ్ ఉన్నప్పటికీ సినిమా ప్రమోషన్స్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో జరగలేదనే అభిప్రాయం మెగా అభిమానుల్లో వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో కూడా "పెద్ది" టీమ్ మరింత అగ్రెసివ్ ప్రమోషన్స్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. ఇదే సమయంలో చిత్ర యూనిట్ మాత్రం ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, జార్ఖండ్ రాజధాని రాంచీలో "పెద్ది" సినిమాకు సంబంధించి ఒక భారీ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి భారత మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ Mahendra Singh Dhoniను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని చూస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ధోనీ స్వస్థలం రాంచీ కావడం, అలాగే సినిమా కూడా క్రీడా నేపథ్యంలో ఉండటంతో ఆయన హాజరు ఈ ఈవెంట్‌ను నేషనల్ లెవెల్‌లో వైరల్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ధోనీ టీమ్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఇంకా అధికారిక ప్రకటన రాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ధోనీ ఈ ఈవెంట్‌కు హాజరైతే మాత్రం, "పెద్ది" సినిమాకు నార్త్ ఇండియా మార్కెట్‌లో భారీ బూస్ట్ లభించే అవకాశముంది. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు, యువతలో సినిమాపై మరింత హైప్ పెరగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications