డ్రైవర్ పై చేయి చేసుకున్న సిఐడి ఎస్పీ: ధర్నా
హైదరాబాద్: సిఐడి పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) అమర్నాథ్ డ్రైవర్ సుదర్శన్ పై చేయిచేసుకున్నాడు. వాహనం డోర్ తీయలేదని తనను దుర్భాషలాడుతూ, తనపై అమర్నాధ్ చేయిచేసుకున్నాడని సుదర్శన్ ఆరోపిస్తున్నాడు. దీంతో దాదాపు 50 మంది డ్రైవర్లు పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అమర్నాధ్ పై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
డ్రైవర్ల ధర్నా సంచలనం సృష్టించింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి డ్రైవర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అమర్నాధ్ పై చర్యకు అదనపు డిజి హామీ ఇచ్చారని ఉన్నతాధికారులు తెలియజేయడంతో డ్రైవర్లు ధర్నాను ఉపసంహరించుకున్నారు. గతంలో కూడా అమర్నాధ్ డ్రైవర్లను వేధించిన సంఘటనలున్నాయని, అందుకే ఎనిమిది మంది డ్రైవర్లు మారారని సుదర్శన్ చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications
