వనన్ కళ్యాణ్ కేసు: వచ్చేనెల 7కు వాయిదా
విశాఖపట్నం: సినీనటుడు పవన్ కళ్యాణ్ బహు భార్యాత్వం కేసు విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా పడింది. తనతో విడాకులు తీసుకోకుండా రేణూదేశాయిని పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ పై ఆయన భార్య నందిని కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పోలీసులు శుక్రవారంనాడు కూడా తుది నివేదిక సమర్పించలేకపోయారు. పాస్ పోర్టు కార్యాలయం నుంచి పత్రాలు రావాల్సిందని, అందుకు సమయం కావాలని కోరడంతో కోర్టు ఇంతకు ముందు కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
అయితే పాస్ పోర్టు కార్యాలయం నుంచి కొన్ని పత్రాలు మాత్రమే వచ్చాయని, అందుకు మరింత సమయం కావాలని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో విచారణను కోర్టు వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే నాలుగు సార్లు పోలీసులు నివేదిక సమర్పించకపోవడంతో కేసు విచారణ వాయిదా పడింది.
ఫ్యామిలీ కోర్టులో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న విడాకుల కేసు, నందిన వేసిన మనోవర్తి కేసు విచారణలు కూడా వచ్చే నెల 7వ తేదీకి వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications
