నిత్య పెళ్లి కొడుకు విజయకృష్ణ అరెస్టు
విశాఖపట్నం: నిత్య పెళ్లి కొడుకు విజయకృష్ణను పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు. అతను ఇప్పటి వరకు ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆరో పెళ్లి చేసుకుని విశాఖపట్నం చేరుకున్న విజయకృష్ణను పోలీసులు అనుసరించి అరెస్టు చేశారు. ఒక అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో విజయకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు.
అమ్మాయిలను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసి చెప్పా పెట్టకుండా విజయకృష్ణ వెళ్లిపోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని అతను అంటున్నాడు. తనను ప్రేమించిన అమ్మాయి తండ్రి తనపై కిడ్నాప్ కేసు పెట్టడంతో పోలీసులు తనను అరెస్టు చేశారని, అంతకు మించి ఏమీ లేదని అతను అంటున్నాడు.












Click it and Unblock the Notifications
