మేడమ్ ఆదేశిస్తే నేను రెడీ
మేడమ్ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని నటి నగ్మా చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఎఐసిసి సదస్సులో పాల్గొన్న నగ్మా మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీలాంటి నేత కాంగ్రెస్ ఉండడం నిజంగా అద్భుతమని, మేడమ్ సోనియాజీ నేతృత్వంలో కాంగ్రెస్ ముందుకు సాగుతుందని నగ్మా అంది. ఈ సందర్భంగా నగ్మా అందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పింది. తెల్లని దుస్తులలో అచ్చమైన కాంగ్రెస్ నాయకురాలిగా ఆమె సదస్సులో అందరి దృష్టిని ఆకర్షించింది.












Click it and Unblock the Notifications
