రాహుల్ ను ప్రజల మీద రుద్దుతున్నారు: బాబు


హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీని బలవంతంగా ప్రజల నెత్తి మీద రుద్దుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి రాకూడదనేది తన అభిమతం కాదని, ప్రజల మద్దతుతో నాయకుడిగా ఎదిగిరావాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎఐసిసి సమావేశాల్లో వ్యక్తి పూజలకు నాయకులు పరిమితమయ్యారని, ప్రజా సమస్యలను చర్చించలేదని ఆయన విమర్శించారు. నాయకులు పోటీ పడి రాహుల్ గాంధీని ప్రశంసించారని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ గత మూడున్నరేళ్ల కాలంలో పార్లమెంటులో ఒక ప్రసంగం మాత్రమే చేశారని ఆయన గుర్తు చేశారు. ఎఐసిసి సమావేశం తూతూ మంత్రంగా సాగిందని ఆయన అన్నారు. వరికి మద్దతు ధరపై, స్వామినాథన్ కమిటీ సిఫార్సులపై సమావేశంలో చర్చించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వరికి మద్దతు ధరపై, రాష్ట్రంలోని ఇతర సమస్యలపై సమావేశంలో మాట్లాడకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. వరికి మద్దతు ధర ప్రకటించే వరకు పోరాటం చేస్తామని, రాష్ట్ర బందుకు కూడా పూనుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+