సోనియాతో భేటీకి రాష్ట్ర నేతల పోటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకోవడానికి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఆదివారంనాడు పోటీలు పడ్డారు. బారికేడ్లను దాటి వారు సోనియాను కసుసుకోవడానికి పరుగులు పెట్టారు. ఈ దృశ్యాన్ని ఫొటోలు తీయవద్దని వారు మీడియా ప్రతినిధులను వారించారు. సోనియాను కలుసుకున్నవారిలో వి. హనుమంతరావు, పి. ఉపేంద్ర వంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు.
దేశపర్యటనను ఆంధ్రప్రదేశ్ తో మొదలు పెట్టాలని రాష్ట్ర నాయకులు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కోరారు. రాష్ట్ర నాయకులు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీలను కలుసుకున్నారు. రాహుల్ గాంధీని వి. హనుమంతరావు ప్రశంసలతో ముంచెత్తారు. నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత అంత నాయకుడు రాహుల్ గాంధీయేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications