టిడిపిది కూడా కులరాజకీయం: రాఘవులు
హైదరాబాద్: కులరాజకీయాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ లాగా దిగజారుతోందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు వ్యాఖ్యానించారు. తాను ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానీయనని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అనడం నిరంకుశత్వమేనని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వ్యక్తిగత విమర్శలు మాని ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి మాట్లాడితే మంచిదని ఆయన అన్నారు.
ప్రజల మద్దతుతో అధికారంలో వస్తామని రాజశేఖర రెడ్డి చెప్పడం వేరు, రిగ్గింగ్ తో అధికారం సంపాదిస్తామని చెప్పడం వేరు అని, ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తామనే విశ్వాసంతో రాజశేఖర రెడ్డి ఆ మాటలు అనలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెసుకు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications