పోలీసుల చేతిలో రేణూ పాసుపోర్టు పత్రాలు
విశాఖపట్నం: సినీ నటుడు పవన్ కళ్యాణ్ రెండో పెళ్లి కేసులో రేణూ దేశాయ్ పోసుపోర్టు అఫిడవిట్ పోలీసులకు అందింది. పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారా, లేదా అని తేల్చడానికి అవసరమైన పత్రాలు తమకు పాసుపోర్టు కార్యాలయం నుంచి అందాయని, అయితే నివేదిక సమర్పించడానికి మరో నాలుగు రోజులు పడుతుందని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ రెండో పెళ్లి కేసుపై నివేదిక సమర్పించడానికి నాలుగు రోజుల గడువు పోలీసులు కోర్టును కోరారు. దీంతో కోర్టు కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. పవన్ కళ్యాణ్ రెండో పెళ్లి కేసులో నివేదిక సమర్పించకపోవడంపై ఇంతకు ముందు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications