ఆసియన్ సెక్సీయస్ట్ మెన్-2007గా షారూక్ ఖాన్
ఆసియన్ సెక్సియస్ట్ ఉమెన్-2007గా బాలీవుడ్ నటి బిపాసా బసు రెండోసారి ఎంపికయింది. బాలీవుడ్ కు మరో గుడ్ న్యూస్. ఆసియన్ సెక్సియస్ట్ మ్యాన్-2007 గా ఓమ్ శాంతి ఓమ్ హీరో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఎంపికయ్యాడు. లండన్ నుంచి వెలువడే బ్రిటిష్-ఆసియన్ పత్రిక కింగ్ ఖాన్ ను సెక్సియస్ట్ మ్యాన్ గా ఎంపిక చేసింది.
హేమంత్ వర్మ ఎడిటర్ గా వస్తున్న ఈస్టర్న్ ఐ పత్రిక నిర్వహించిన సెక్సియెస్ట్ ఆసియన్ మెన్ నిర్వహించిన సర్వేలో షారూక్ ఖాన్ సెక్సియస్ట్ మెన్ గా నిలిచాడు. గత సంవత్సర విజేత అభిషేక్ బచన్ ఈసారి నాలుగవ స్ఠానానికి దిగజారాడు. హృతిక్ రోషన్ రెండో స్థానంలో, జాన్ అబ్రహం మూడో స్తానంలో నిలిచారు. ఉపేన్ పటేల్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలీ జాఫర్, జయ్ సీన్, సైఫ్ అలీ ఖాన్ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications
