ఆర్టీసి చార్జీలు పెరగువు: వైయస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) బస్సు చార్జీలు పెరగడం లేదు. చార్జీల పెంపునకు ఆర్టీసి చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వెనక్కి పంపారు. ఆర్టీసి అధికారులతో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష జరిపారు. రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆర్టీసి చార్జీలను పెంచడానికి ముఖ్యమంత్రి అంగీకరించలేదని, ముందు కార్యనిర్వాహకాధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని కన్నా లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. పనితీరు మెరుగుకు వారంలో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి ఆర్టీసి అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications
