మద్యం దుకాణాల కేటాయింపు, అమ్మకాలు ఇక.. ప్రభుత్వం కీలక మార్పులు..!!
ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల కేటాయింపు తో పాటుగా అమ్మకాల విషయంలోనూ కొత్త ప్రతిపాదనల ఆమోదానికి రంగం సిద్దమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం విధానం అమల్లోకి తెచ్చారు. ఆ మేరకు మద్యం షాపులు కేటాయించారు. ప్రస్తుతం వాటి గడువు పూర్తయింది. దీంతో.. తాజాగా వీటి పైన నిర్ణయంతో పాటుగా అమ్మకాల విషయంలోనూ కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఏపీలో గడువు పూర్తయిన మద్యం దుకాణాల లైసెన్సుల పైన సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త మద్యం దుకాణాల ఏర్పాటు కు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వాటి రెండేళ్ల కాల పరిమితి పూర్తయింది. కాగా.. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు కీలక విషయాన్ని వెల్లడించారు. ఏపీలో మద్యం పాలసీ పక్కాగా అమలు చేైస్తూ.. విక్రయాలను పారదర్శకంగా చేస్తున్నామ ని అన్నారు. మద్యం టెండర్ల గడువు ముగియబోతోందని... అయినా ప్రస్తుతం ఎన్ని దుకాణాలు ఉన్నాయో వాటిని రెన్యువల్ చేస్తామని వివరించారు. అయితే ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి అదనంగా విక్రయించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠినంగా ఉంటామని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో దీనిని సెట్ రైట్ చేసుకునే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో
అదే విధంగా మద్యం అమ్మకాల విషయంలో కృత్రిమ మేధ (ఏఐ)ను విస్తృతంగా వినియోగించే దిశగా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపడుతోంది. మద్యం దుకాణాల్లోని సీసీ కెమెరాలకు ఏఐతో అనుసంధానం చేయనుంది. షాపుల పనివేళలు, అమ్మకాలపై నిఘా పెట్టనుంది. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త మద్యం పాలసీలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతి మద్యం షాపులోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని ఎక్సైజ్ కార్యాలయంలో ర్యాండమ్‌గా పరిశీలిస్తుంటారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా షాపులు మూయకపోయినా, ముందే తెరిచినా ఏఐ అధికారులకు తెలుపుతుంది. అలాగే మద్యం సీసాలను స్కాన్ చేయడాన్ని వచ్చే పాలసీ నుంచి తప్పనిసరి చేస్తున్నారు. మద్యం షాపుల్లో జరిగే అన్ని రకాల ఉల్లంఘనలనూ ఏఐ ద్వారా గుర్తించేలా టెక్నాలజీ రూపొందిస్తున్నారు.












Click it and Unblock the Notifications
