విశ్వసుందరిగా చైనా భామ ఝాంగ్ జిలిన్
సన్యా: ఈ ఏడాది ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) కిరీటం చైనా భామ ఝాంగ్ జిలిన్‌ను వరించింది.23 ఏళ్ల ఝాంగ్ జిలిన్ చైనాలోని సన్యా నగరంలో శనివారం జరిగిన ఫైనల్స్‌లో విజయం సాధించింది. కాగా, అంగోలా సుందరి మైఖేలా రీస్, మెక్సికో భామ కరోలినా మొరాన్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
వీరితో పాటు ట్రినిడాడ్, టొబాగో, స్వీడన్ భామలు ఈ పోటీలలో వరుసగా తొలి ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు. భారత సుందరి సారాజేన్ డియాజిన్ సెమీఫైనల్‌నే వెనుకబడ్డారు. 57 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పోటీల్లో చైనా తొలిసారిగా విశ్వసుందరి కిరీటాన్ని సాధించడం గమనార్హం.












Click it and Unblock the Notifications
