డాక్టర్లను సస్పెండ్ చేయండి: అఫ్సర్
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లపై మజ్లీస్ ఎదురుదాడికి దిగింది. తమతో గొడవ పడిన నీలోఫర్ వైద్యులను సస్పెండ్ చేయాలని మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. వైద్యం అందించాలని తాము వైద్యులకు విజ్ఞప్తి చేశామని, మహిళా వైద్యులతో కబుర్లాడుతూ వారు రోగిని పట్టించుకోలేదని ఆయన చెప్పారు. నీలోఫర్ నిర్లక్ష్యానికి కేంద్రంగా మారిందని ఆయన అన్నారు.
నీలోఫర్ ఘటనలో తమ తప్పేమీ లేదని, అంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని ఆయన చెప్పారు. వైద్యులను తమను దూషించడం వల్లనే గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాను బాధ్యతాయుతమైన వ్యక్తినని, ఎలా వైద్యులను దూషిస్తానని ఆయన అన్నారు. నీలోఫర్ వైద్యులు వైద్యవృత్తి గౌరవాన్ని నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
