చిరంజీవి పార్టీ ఖాయం: కృష్ణయ్య
హైదరాబాద్: చిరంజీవి జనవరిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమని, ఈ మేరకు తమకు సంకేతాలు అందాయని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అంటున్నారు. తాము చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నామని ఆయన ఒక ప్రైవేట్ తెలుకు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. చిరంజీవికి బిసిల అండ ఉంటుందని ఆయన అన్నారు.
చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని మాలమహానాడు నాయకుడు కారెం శివాజీ రాజమండ్రిలో అన్నారు. సర్వజన సమ్మేళనం తర్వాత చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. చిరంజీవితో మాట్లాడక చాలా రోజులవుతోందని, తనకు చిరంజీవి రాజకీయరంగ ప్రవేశంపై ఏమీ తెలియదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య అన్నారు












Click it and Unblock the Notifications
