తెలంగాణపై చిరు వైఖరికి తెరాస డిమాండ్
హైదరాబాద్: తెలంగాణపై చిరంజీవి తన వైఖరిని వెల్లడించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే చిరంజీవిని ఆహ్వానిస్తామని, చిరంజీవితో కలసి పనిచేయడానికి కూడా సిద్ధపడుతామని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే చిరంజీవి రాజకీయ ప్రవేశం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన అన్నారు.
గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట మార్చిందని, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, దీంతో ఈ రెండు పార్టీలు కూడా సంక్షోభంలో పడ్డాయని, అందువల్ల చిరంజీవి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా పార్టీ పెడితే ప్రయోయం ఉండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
