చిరంజీవి వెంటనే ప్రతిస్పందించాలి: నారాయణ
హైదరాబాద్: రాజకీయ పార్టీ పెట్టే విషయంపై వెంటనే ప్రతిస్పందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ మెగాస్టార్ చిరంజీవికి విజ్ఞప్తి చేశారు. చిరంజీవి జనవరిలో పార్టీ పెడతారని వచ్చిన వార్తలపై ఆయన మంగళవారం ఆ విజ్ఞప్తి చేశారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై తమకు ఏ విధమైన సంకేతాలు అందలేదని ఆయన చెప్పారు.
రాజకీయాలు ఎవరి గుత్త సొత్తు కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయని, ఆ గుత్తాపిధిత్యాన్ని దెబ్బ తీయడానికి మూడో ప్రత్యామ్నాయం అవసరమని, అందుకు చిరంజీవి ముందుకు వస్తే మంచిదేనని ఆయన అన్నారు. చిరంజీవి కొత్త పార్టీ పెడితే మంచిదేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
