చిరంజీవి పరిశీలనలో స్వయంకృషి పార్టీ?
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పెట్టబోయే రాజకీయ పార్టీకి పేరు కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. తాను పెట్టబోయే పార్టీకి స్వయంకృషి పేరు ఖరారు చేసే విషయం గురించి చిరంజీవి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాధ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి సినిమాలో చిరంజీవి హీరోగా నటించారు. ఈ సినిమాలో ప్రస్తుత తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు విజయశాంతి హీరోయినుగా నటించారు. చెప్పులు కుట్టే స్థాయి నుంచి ఒక బడా పారిశ్రామికవేత్తగా ఎదిగిన వైనం ఈ సినిమాకు ఇతివృత్తం.
చిరంజీవి తన పార్టీని జనవరి 15వ తేదీన సంక్రాంతి పర్వదినం రోజు ప్రకటించవచ్చునని ఇప్పటికే ప్రచారంలో ఉంది. చిరంజీవి సొంతగా పార్టీ పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications