అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఆంధ్ర విద్యార్థి అనిల్ రెడ్డి మిద్దెంకి కుటుంబానికి సాయం అందించాలని నిజామాబాద్ డాట్ ఆర్గ్ ప్రతినిధి బుచ్చన్న గాజుల విజ్ఞప్తి చేశారు. అనిల్ మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని స్వగ్రామానికి పంపడానికి, తదితరాలకు విరివిగా ఖర్చవుతుందని, అతనికి జీవిత, ఆరోగ్య బీమాలు లేవని ఆయన అన్నారు. అనిల్ ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాద్ జిల్లా బిచుకుంద మండలం వాజిద్ నగర్ గ్రామానికి చెందినవాడు. అతని మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అనిల్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలో ఇసిఇ బిటెక్ చదివాడు. సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికాకు వచ్చాడు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ రెస్టారెంటులో నవంబర్ 29వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించాడు. అనిల్ కుటుంబానికి తగిన సహాయం అందించేందుకు తాము బే ఏరియా తెలుగు అసోసియేషనుతో కలిసి పనిచేస్తున్నట్లు బుచ్చన్న తెలిపారు. http://www.bata.org/Anilreddy.htm అనే దాన్ని క్లిక్ చేసి తగిన సహాయం అందివచ్చు. అనిల్ రెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి అమెరికా తెలుగు అసోసియేషన్ వేయి డాలర్లు విరాళంగా ఇచ్చింది.












Click it and Unblock the Notifications