మావోయిస్టు అగ్రనేత సాగర్ అరెస్టు
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత సాగర్ అలియాస్ పాండురంగారెడ్డిని పోలీసులు చెన్నైలో అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. సాగర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. సాగర్ మావోయిస్టు తమిళనాడు రాష్ట్ర కమిటీ కార్యదర్శి. సాగర్ ను వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఎపిసిఎల్సీ) డిమాండ్ చేస్తోంది.
సాగర్ కు ఆశ్రయమిచ్చినవారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.












Click it and Unblock the Notifications